తొలిప్రేమకు ఢోకా లేదు !

Friday, February 16th, 2018, 05:30:30 PM IST

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శ కత్వం లో విడుదలయిన తొలి ప్రేమ చిత్రం మొదటి రోజునుండి మంచి టాక్ తో రన్ అవుతోంది. దర్శకుడి కథ కథనాలు, వరుణ్, రాశిల జంట నటన, అదరహో అనిపిస్తున్న థమన్ సంగీతం వెరసి చిత్రం యూత్ ని బాగా అట్ట్రాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలానే థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా హెల్ప్ అయిందని అంటున్నారు. ఇప్పటికే మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం రానున్న రెండు మూడు వారాల్లో కూడా తన హవాని కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే ఈ చిత్రంతో పాటు విడుదలయిన సాయి ధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ ఘోర పరామజయం పాలవగా, మోహన్ బాబు నటించిన గాయత్రి పర్వాలేదనిపించే రీతిలో నడుస్తోంది. ఇక నేడు విడుదలయిన అ! చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. మొదటి అర్ధభాగం బాగున్నా, రెండవ అర్ధభాగం అంతగా లేదని, క్లైమాక్స్ బాగుందని అంటున్నారు. అదీకాక సి క్లాస్ ఆడియన్స్ కు ఎంతవరకు రీచ్ అవుతుందనేది సందేహమే అంటున్నారు. దర్శకుడి ప్రతిభ బాగున్నప్పటికీ ఈ చిత్రం రానున్న రోజుల్లో ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అవుతుందో వేచి చూడాలి. ఎలాగూ రానున్న రెండు మూడు చిత్రాలేవీ పెద్దగా విడుదల కావడం లేదు. దీన్ని బట్టి చూస్తే తొలిప్రేమ చిత్రానికి రానున్నవి మంచి రోజులేనని, అప్పటివరకు దీనికి ఎదురు ఉండదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం….