లేటెస్ట్:‘అట్టా సూడకే కొట్టినట్టుగా అట్టాసూకడే’ అంటున్న స్టార్ హీరో!

Tuesday, February 13th, 2018, 06:57:55 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా కథా రచయిత వక్కంతం వంశి తొలి సారి మెగా ఫోన్ పడుతున్న చిత్రం నా పేరు సూర్య . అయితే ఇటీవల విడుదలయిన ప్రచారచిత్రం, సైనిక అనే పాట మంచి క్రేజ్ సంపాదించి, చిత్రం పై అంచనాలు మరింత పెంచాయి. అయితే ఈ చిత్రంలోని రెండవ పాటగా ఒక డ్యూయెట్ ను ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాట ని ఎప్పుడెప్పుడు వింటామా అని అభిమానులు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వారి ఉత్సవాహాన్ని పెంచేందుకు ఒక రోజు ముందు అంటే ఈ రోజు యూనిట్ ఆ పాత తాలూకు ప్రోమోని విడుదల చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్గా మారింది. మంచి ట్రెండీ బీట్ తో సాగుతూ యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉండేటట్లు వుంది ఈ ప్రోమో వింటుంటే. ‘అట్టా సూడకే కొట్టినట్టుగా అట్టాసూకడే సిట్టి గుండెకే ఊరికూరికే సొట్టపెట్టకే’ అనే పల్లవితో సాగే ఈ పాట రేపు పూర్తిగా బయటకి వచ్చాక ఇంకెంత హిట్ అవుతుందో వేచి చూడాలి….