ఈ ఏడాది యంగ్ రెబెల్ స్టార్ ఫాన్స్ కి డబల్ బొనాంజా

Wednesday, January 10th, 2018, 10:02:58 AM IST

యంగ్ రెబెల్ ప్రభాస్ హీరోగా యు వి క్రియేషన్స్ పతాకం పై సుజిత్ దర్శకత్వం లో నటిస్తున్న నూతన చిత్రం సాహూ. బాహుబలి తరువాత ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యారు, ఆయన అభిమానులు తదుపరి చిత్రం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే కొన్ని చిన్న సమస్యల వల్ల షూటింగ్ కి అంతరాయం కోలుగుతోంది, ఇప్పటివరకు ఈ చిత్రం దాదాపు సగం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్రం లోని కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలని దుబాయ్ లో చిత్రీకరించాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ యూనిట్ సబ్యులకు పర్మిషన్ దొరకలేదు. ఇదివరకు ఒకసారి అనుమతి దొరికినపుడు, యూనిట్ వేరొక షెడ్యూల్ తో బిజీ గా ఉండడంతో అప్పుడు వెళ్లడం కుదరలేదు, ఇప్పుడేమో పేర్మిషన్ దొరికేవరకు వేచిచూడక తప్పేలాలేదు. కధ రీత్యా కొన్ని యాక్షన్ సీన్స్ దుబాయ్ లో అయితేనే బాగా అద్భుతంగా వస్తాయి అనే నమ్మకంతో అక్కడి పర్మిషన్ కోసం ఈసారి గట్టిగ ప్రయత్నిస్తున్నారు. అందువల్లే సినిమా విడుదల మరికొంత జాప్యం జరిగింది, సాహూ ఈ ఏడాది ప్రథమార్ధంలో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అసలు విషయం లోకి వెళితే, ప్రభాస్ దీనితో పాటే తన తదుపరి చిత్రం రాధాకృష్ణ తో చేయడానికి కమిట్ అయినా విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా సాహూ పూర్తయ్యే లోపే మొదలు పెట్టె అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఈ సినిమాని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సంవత్సరం ఆఖరులో రిలీజ్ చేద్దాం అనే ప్లాన్ లో వున్నారు. ఒక వేళ అదే కనుక జరిగితే ప్రభాస్ అభిమానుల కి ఈ సంవత్సరం డబుల్ బొనాంజా అనే చెప్పుకోవాలి…