చిరు – పవన్ మల్టీ స్టారర్ కి నో ఛాన్స్ ఎందుకంటే

Saturday, February 11th, 2017, 11:04:17 AM IST


మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఒక ఫుల్ లెంత్ మల్టీ స్టారర్ సినిమా చేస్తే ఇంకేమైనా ఉందా ? బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోద్ది. ఎవ్వరూ ఊహించని ఈ కాంబినేషన్ ని తెరమీదకి తీసుకుని వస్తా అంటూ సుబ్బిరామిరెడ్డి మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన సెన్సేషన్ అంటూ చెప్పి సైలెంట్ అయిపోయారు. కానీ రోజులు గడిచేకొద్దీ ఈ సెన్సేషనల్ న్యూస్ నెమ్మదిగా జోక్ లాగా మారిపోతోంది. జనాలకు క్రమంగా ఈ కాంబో మీద నమ్మకం పోతోంది. టి.సుబ్బిరామిరెడ్డి ఏదో అత్యుత్సాహంతో ప్రకటన చేశారు తప్ప నిజంగా ఈ కాంబో తెరమీదికి రావడం అసాధ్యమనే అనిపిస్తోంది. ఎందుకంటే సుబ్బిరామిరెడ్డి తప్ప ఇంకెవ్వరూ కూడా ఈ చిత్రం గురించి ఒక్క మాట మాట్లాడలేదు. వీరిద్దరి లో ఒక్కరు కూడా లేదా ఆయన చెప్పిన డైరెక్టర్ త్రివిక్రమ్ కి కూడా ఈ సినిమా మీద ఎలాంటి అభిప్రాయం లేదు అంటున్నారు