అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్ తో అల్లరి ప్రియుడు… ఏమౌతుందో

Tuesday, May 8th, 2018, 09:17:04 AM IST

సీనియర్ హీరో రాజశేఖర్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచిపోవడమే కాదు.. కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిన సినిమా అల్లరి ప్రియుడు. ఆ తర్వాత పలు హిట్స్ సాధించినా.. కొన్నేళ్లుగా సక్సస్ కోసం మొహం వాచిన ఈ హీరో.. రీసెంట్ గా పీఎస్వీ గరుడవేగ మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. బడా సినిమాల విషయంలో ఈయన పేరు తరచుగా వినిపిస్తోందంటే.. రాజశేఖర్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్ధమవుతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురుగా.. ధనుష్ భర్తగానే కాకుండా.. దర్శకురాలిగా కూడా ఐశ్వర్యకు గుర్తింపు ఉంది. ఇప్పటికే ఈమె డైరెక్షన్ లో రెండు సినిమాలు వచ్చాయి.
మొదటగా తన భర్తనే హీరోగా పెట్టి 3.. ఆ తర్వాత గౌతమ్ కార్తీక్ హీరోగా వెయ్ రాజా వెయ్ అంటూ మరో సినిమాను రూపొందించింది ఐశ్వర్య. అయితే.. ఈ రెండు సినిమాలు ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడీమె మరో మూవీ తీసేందుకు రెడీ అయిపోగా.. హీరో పాత్ర కోసం రాజశేఖర్ ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. రాజశేఖర్ ను ఓ స్టార్ హీరోయిన్ పక్కన నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఐశ్వర్యా ధనుష్ రూపొందించే ఈ చిత్రానికి ధనుష్ నిర్మాణం వహించనున్నాడు. అయితే.. ఇది ఇద్దరు హీరోల సినిమా కాగా.. ఓ కోలీవుడ్ హీరోని.. ఇద్దరు హీరోయిన్లను త్వరలో ఫైనలైజ్ చేయనున్నారట. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడి ఈమధ్యనే కోలుకున్న రాజశేఖర్ కు.. ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్ ఐశ్వర్య ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments