ప్రాణం తీసిన డ్రైనేజీ……కారుతో సహా పడి యువతి మృతి!

Wednesday, May 2nd, 2018, 09:25:33 PM IST


మన ప్రభుత్వాలు ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఎక్కడో ఒకచోట కొందరు చేసే తప్పులకు అనవసరంగా అమాయకులు అనుకోకుండా బలవుతున్నారు. ఇటీవల నోయిడాలో రోడ్ పై వున్న మురుగునీటి గుంతలో కారుతో సహా పడి ఒక యువతీ మరణించింది. ఈ సంఘటన ఆ ప్రాంత వాసులను విషాదంలో నింపింది. విషయంలోకి వెళితే రేడియో మిర్చి సంస్థలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న 26ఏళ్ళ యువతీ తాన్యా ఖన్నా అర్ధరాత్రి ముంబై లోని నోయిడా ప్రాంతం, సెక్టార్ 94 లో వున్న మురుగు నీటి గుంతలో పడిపోయింది. ఆ రోడ్ లో తన వెర్నా కారులో ఒకింత వేగంగా వెళుతున్న ఆమె మురుగుగుంతను నీటి ప్రవాహంలో గమనించని కారణంగా ఒక్కసారిగా కార్ ను అదుపు చేయలేక కార్ తో సహా గుంతలోకి వెళ్ళిపోయింది.

అయితే ఆ సమయంలో అటుగా వెళ్తున్న అజ్ఞాత వ్యక్తి ఒకరు వున్నట్లుండి పోలీస్ లకు సమాచారం అందించాడు. అయితే ఉదయాన్నే కార్ ను ఎలాగోలా కశ్పతి బయటకు తీయించిన పోలీస్ సిబ్బందికి అప్పటికే మ్రించి ఉబ్బిపోయి వున్న తాన్యా మృత దేహాన్ని కారుతో సహా బయటకు తీశారు. అనంతరం ఆమె కుటుంబ సబ్యులకు సమాచారం అందచేసినట్లు, జరిగిన మొత్తం విషయమై తదుపరి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు నోయిడా పోలీస్ అధికారులు తెలిపారు. అసలు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అటువంటి డ్రైనేజీ గుంతలను అందరూ గుర్తించేలా ఏర్పాట్లు చేస్తే ఇటువంటి దుర్ఘటనలు జరగవని స్థానికులు అంటున్నారు….