టీజర్: షకలక శంకర్ డ్రైవర్ రాముడు

Tuesday, May 22nd, 2018, 08:39:40 PM IST

జబర్డస్త్ షో ద్వారా క్రేజ్ అందుకున్న షకలక శంకర్ ఆ తరువాత సినిమాలో మంచి కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హీరోగా కూడా అలరించడానికి శంకర్ సిద్దమయ్యాడు. డ్రైవర్ రాముడు అనే కామెడీ ఎంటర్టైనర్ ద్వారా శంకర్ త్వరలోనే ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. సినిమాకు సంబందించిన టీజర్ ను కూడా రిలీజ్ చేశాడు. టీజర్ ని చూస్తుంటే సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టినట్లు అనిపిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో సప్తగిరి రెండు సినిమాలతో అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు షకలక శంకర్ కూడా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించనుంది. కొత్త హీరోయిన్ అంచల్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక రాజ్ సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments