సినిమా సెట్లో ప్రముఖ హీరోపై దాడి..!

Thursday, December 7th, 2017, 10:31:34 AM IST

బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ కపూర్ పై ఓ వ్యక్తి దాడికి దిగాడు. అర్జున్ కపూర్ ప్రస్తుతం నటిస్తున్న ‘సందీప్ ఔర్ పింకీ పరార్’ చిత్ర సెట్లో ఈ ఘటన జరగడం గమనార్హం. అనూహ్యంగా జరిగిన దాడితో చిత్ర యూనిట్ షాక్ కి గురైంది. ఉత్తరాఖండ్ లో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ చూసేందుకు కమల్ కుమార్ అనే కారు డ్రైవర్ సెట్స్ కి వవెళ్ళాడు.

అతడు ఫుల్ గా మందు కొట్టి సెట్స్ కి వెళ్లాడు. అర్జున్ కపూర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చిన అతడు మద్యం మత్తులో ఒక్కసారిగా హీరో పై విరుచుకుపడ్డాడు. వేగంగా స్పందించిన అర్జున్ కపూర్ వ్యక్తిగత సిబ్బంది అతడిని వెనక్కు లాగి పోలీస్ లకు అప్పగించారు. పోలీస్ లు అతడిపై కేసు నమోదు చేశారు. అతడి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments