ఫస్ట్ షో టాక్ : ‘దువ్వాడ జగన్నాథమ్’ ప్రీమియర్ షో టాక్ !

Friday, June 23rd, 2017, 02:29:13 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా మేనల్లుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన నటన, డాన్సులు, స్టైలిష్ మానరిజమ్స్ తో తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం సినిమా సినిమాకి బన్నీ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నాడు. సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ విజయం తరువాత బన్నీ నటించిన చిత్రం ‘డీజే’. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. డీజే నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్ర ప్రీమియర్ షో అమెరికాలో పూర్తయింది. ఈ సందర్భంగా డీజే ప్రీమియర్ షో టాక్ మీకోసం..

సాధారణంగానే అల్లు అర్జున్ ఈ చిత్రంలో తన డాన్సులు, ఫైట్ లతో ఆకట్టుకున్నాడు. డీజే ఫస్ట్ హాఫ్ కు అభిమానులనుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ సెకండ్ హాఫ్ లో కొంత కన్ఫ్యూషన్ కి గురి చేయడం మైనస్ గా మారే అవకాశాలు కలిపిస్తున్నాయి. మాస్ ఆడియన్స్ కు ఈ చిత్రం నచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ క్లాస్ ఆడియన్స్ లో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.పోను పోను ఈ టాక్ ఎలా మారుతుందో చూడాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో దేవిశ్రీప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణ. కథ, కథనంలో పట్టు లోపించడం, క్లైమాక్స్ సడెన్ గా అయిపోయిందన్న ఫీలింగ్ మైనస్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా డీజే యావరేజ్ సినిమా అనే టాక్ ప్రేక్షకుల నుంచి వస్తోంది.