బ‌న్నితో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది!

Friday, May 25th, 2018, 09:47:56 PM IST

స్నేహం పాత‌బ‌డ‌దు! అది ఎప్పుడూ నిత్య‌నూత‌నంగా విరాజిల్లుతుంది. అంతేనా.. అనుకోకుండా పాత మిత్రుడిని క‌లిసిన‌ప్పుడు ఉండే మ‌జాకే వేరుగా ఉంటుంది. ఇదిగో ఇక్క‌డ పూజాని చూస్తే ఆ సంగ‌తి ఇట్టే అర్థ‌మ‌వుతుంది. డీజే చిత్రంలో త‌న కోస్టార్ బ‌న్నిని స‌రిగ్గా ఏడాది త‌ర‌వాత ఈ అమ్మ‌డు క‌లుసుకుంది. బ‌న్నితో పాటు ఆ స‌న్నివేశంలో డీజే ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్, డీవోపీ బోస్‌ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. అయితే ఇదంతా అనుకోని మీటింగ్ అని చెప్పింది పూజా. ఒక సంవ‌త్స‌రం త‌ర‌వాత ఇలా మ‌రోసారి తిరిగి క‌లుసుకున్నాం.. అంటూ సంబ‌రంగా ట్వీట్ చేసింది పూజా హెగ్డే.

డీజే టీమ్ అంతా ఓచోట క‌లుసుకున్న సంగ‌తి స‌రే. ఇంత‌కీ క‌లుసుకున్న త‌ర‌వాత పార్టీ ఏమైనా చేసుకున్నారా? అన్న‌ది పూజా చెప్ప‌నేలేదు. అలాగే బ‌న్ని స‌ర‌స‌న మ‌రో ఛాన్సొస్తే న‌టిస్తుందా? లేదా.. ? అన్న‌ది చెప్ప‌లేదు. మ‌రోవైపు ఈ ముంబై బొమ్మ‌కు క్ష‌ణం తీరిక లేనంత బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. ఓవైపు ఎన్టీఆర్‌తో సినిమా, మ‌రోవైపు చ‌ర‌ణ్ – బోయ‌పాటి సినిమా చేస్తూ బిజీగా ఉంది. అలానే ప్ర‌భాస్‌తో వేరొక సెట్‌కి వెళ్లాల్సి ఉందింకా.

  •  
  •  
  •  
  •  

Comments