ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 25న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎమ్మెల్సీలు తిప్పేస్వామి, వెంకన్న చౌదరి, సంధ్యారాణి, మహమ్మద్ ఇక్బాల్‌లు మార్చి 29న రిటైర్ కానున్నారు. వీటితో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయగా ఏర్పడిన స్థానానికి మరియు చల్లా రామకృష్ణా రెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి కూడా మార్చి 15న ఉప ఎన్నిక జరగనుంది.
అయితే నామినేషన్లు దాఖలు చేసేందుకు మార్చి 4 తుది గడువు కాగా నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 8 వరకు గడువు విధించింది. మార్చి 15 న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రారంభం కానుంది.