ఈడీ తవ్వితే ‘కోటక్’ మేనేజర్ కోట్ల డబ్బు బయటపడింది..!

Wednesday, December 28th, 2016, 11:25:49 PM IST

kotak
ఢిల్లీలోని కేజీ మార్గ్ వద్ద కోటక్ మహీంద్రా బ్యాంకు మేనేజర్ ఆశిష్ కుమార్ ని ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో అతడిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసారు. కాగా అతడి అక్రమ డబ్బు పై విచారణ ప్రారంభించిన ఈడీ తవ్వేకొద్దీ ఆశ్చర్యకర విషయాలు బయటపడుతున్నాయి. కాగా అతడికి ఇటీవల అరెస్టైన రోహిత్ టాండన్ అనే వ్యక్తి నుంచి రూ 51 కోట్లు అందినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.వాటిలో రూ 38 కోట్లని నకిలీ ఖాతాల సృష్టించినట్లు బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

అతడు మార్చిన డబ్బు మొత్తానికి నకిలీ ధ్రువపత్రాలను కూడా సృష్టించాడు. ఇప్పటివరకు నగదుని మార్చినందుకు కమిషన్ల ద్వారా అతడు రూ 13 కోట్లని సంపాదించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మంగళవారం అతడిని ఇది అధికారులు అరెస్టు చేయగా ఐదు రోజుల పాటు విచారించేందుకు కోర్టు ఈడీకి అనుమతినిచ్చింది. దీనితో ఈడీ అధికారులు అతడిని రిమాండ్ కు తీసుకుని విచారిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments