కన్నడంలోకి .. తెలుగు హీరోయిన్ ?

Tuesday, October 2nd, 2018, 10:22:13 AM IST

తెలుగు హీరోయిన్లకు తెలుగు పరిశ్రమలో అవకాశాలు రావా ? అన్న ప్రశ్న ఇంకా ప్రశ్నగానే మిగిలింది .. నిజామే 70, 80, దశకంలో తెలుగు పరిశ్రమలో కేవలం తెలుగు హీరోయిన్లే ఉండేవారు .. ఎదో గెస్ట్ పాత్రల్లో బాలీవుడ్ హీరోయిన్లు ఎప్పుడో కనిపించేవారు .. కానీ 90 వ దశకం తరువాత సీన్ రివర్స్ అయింది .. తెలుగు హీరోయిన్స్ తక్కువయ్యారు .. దాంతో బాలీవుడ్ నుండి హీరోయిన్లను దిగుమతి చేసుకోవడం .. వాళ్ళ గ్లామర్ అందాల్లో ప్రేక్షకులు తడిసి ముద్దవ్వడంతో అటు సినిమా వాళ్ళు .. ఇటు జనాలు కూడా ముంబై భామాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం .. ఆ తరువాత 2000 సంవత్సరం తరువాత తెలుగు హీరోయిన్స్ ఒకరో ఇద్దరో తప్ప మిగిలిన భామలంతా పరాయి బాషా హీరోయిన్స్ కావడం విశేషం. ఆ తరువాత తెలుగు హీరోయిన్లకు ఇక్కడ అవకాశాలు సన్నగిల్లాయి .. మహా అయితే రెండు మూడు సినిమాలకు మించి నెట్టుకురావడం లేదు. ఈ దశాబ్ద కాలంలో ఏ తెలుగు అమ్మాయి టాప్ హీరోయిన్ రేసులో లేదంటే .. పరిస్థితి ఎలా ఉందొ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దీనికి మరోలా చెప్పాలంటే పొరుగింటి పుల్లకూర రుచి ? అంతే సరే అసలు విషయం ఏమిటంటే ..

తెలుగు భామ ఈషా రెబ్బ గుర్తుందిగా .. అంతకుముందు ఆ తరువాత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాదీ అమ్మాయి .. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించింది. అయితే పెద్దగా విజయాలను అందుకోలేదు గాని .. హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన అరవింద సమేత లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ అమ్మడు కన్నడంలోకి ఎంట్రీ ఇస్తుంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఈషా హీరోయిన్ గా ఎంపికయింది. త్వరలోనే కన్నడ షూటింగ్ లో జాయిన్ కానుంది. మరి కన్నడలో ఈ అమ్మడు ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.