గ్లామర్ డోస్ పెంచుతున్న తెలుగు హీరోయిన్ ?

Thursday, September 13th, 2018, 03:54:25 PM IST

తెలుగు హీరోయిన్స్ కు తెలుగులో అవకాశాలు తక్కువ అన్న నానుడిని ఇప్పటికే పలువురు హీరోయిన్స్ నిరూపించారు. తెలుగులో కేవలం రెండు మూడు సినిమాలతో ఇక్కడ రాణించలేక .. అటు కోలీవుడ్డో .. మాలి వుద్దో అంటూ పరభాషా పరిశ్రమ బాట పడుతున్నారు. ఎంతైనా పొరుగింటి పుల్ల కూర రుచి అన్న చందంగా తెలుగు వారికి ఇతర బాషా హీరోయిన్స్ పైనే క్రేజ్. ఇంతకీ విషయం ఏమిటంటే .. అంతకుముందు ఆ తరువాత సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన తెలుగు పిల్ల ఈషా రెబ్బ కు ఈ మధ్య కెరీర్ పరంగా సరైన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. లేటెస్ట్ గా నటించిన బ్రాండ్ బాబు కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. దానికంటే ముందే ఎన్టీఆర్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని గట్టిగానే పట్టు పట్టిన ఈ అమ్మడు కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచేస్తుందట. అంతే కాదు కాస్త బరువు తగ్గి .. స్లిమ్ గా మారిందట. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే గ్లామర్ తప్పని సరి అని తెలుసుకున్నట్టుంది కాబట్టి కాస్త డోస్ పెంచేందుకు రెడీ అన్నట్టు హింట్స్ కూడా ఇస్తుందట. సో ఈ దెబ్బతో ఈషా రెబ్బ కు తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని అంటున్నారు సినీ జనాలు.

  •  
  •  
  •  
  •  

Comments