ఏక్ దో తీన్‌.. రీమిక్స్ సాంగ్ డ్యాన్సింగ్‌ దేవ‌త‌కు అంకితం

Sunday, February 11th, 2018, 10:23:42 PM IST

80-90ల‌లో డ్యాన్సిగ్ క్వీన్‌గా వెలిగిపోయిన మాధురి ధీక్షిత్ అప్ప‌ట్లో 1988 క్లాసిక్ హిట్ `తేజాబ్‌`లో `ఏక్ దో తీన్ … ` సాంగ్ లో న‌ర్తించిన సంగ‌తి తెలిసిందే. ఆ పాట బంప‌ర్ హిట్. అందులో మాధురి ధీక్షిత్ డ్యాన్సులు అంతే హైలైట్‌. ఎప్ప‌టికీ గ్రేట్ క్లాసిక్స్‌లో ప‌దిలంగా నిలిచిపోయే పాట అది. నాడు యువ‌త‌రాన్న ఓ రేంజులో ఊపేసింది ఈ గీతం. అంత‌టి ప్రాముఖ్యత ఉన్న ఈ పాట‌ను తిరిగి రీమిక్స్ చేస్తున్నారు.. అన‌గానే ర‌క‌ర‌కాల సందేహాలు పుట్టుకొచ్చాయి. మాధురిలా డ్యాన్సులు చేసేంత‌టి ట్యాలెంటు దొరికిందా? అంటూ కొంద‌రు పెద‌వి విరిచేశారు.

అయితే ఈ క్లాసిక్ సాంగ్‌లో న‌వ‌త‌రం క‌థానాయిక జాక్విలిన్ ఫెర్నాండెజ్ డ్యాన్స్ చేసే సాహ‌సం చేసింది. ఆ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా అంగీక‌రించ‌డ‌మే గాకుండా మాధురిలా వేరొక‌రు చేయ‌డం అసాధ్య‌మ‌ని చెప్పింది. అంతేకాదు తాము ఆ పాట‌ను అలా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని .. ప్ర‌స్తుత రీమిక్స్ అందుకు పూర్తి విభిన్నంగా ఉంటుంద‌ని తెలిపింది. మా అందరి ఫేవ‌రెట్ డ్యాన్సింగ్ స్టార్ మాధురికి ఈ పాట‌ను అంకిత‌మిస్తున్నామ‌ని చెప్పింది జాక్విలిన్ ఫెర్నాండెజ్‌. `భాఘి 2` కోసం ఈ పాట‌ను రీమిక్స్ చేస్తున్నారు. మాధురి మ్యాడ‌మ్ డ్యాన్సుల‌తో అస్స‌లు నా డ్యాన్సులు ఏవీ మ్యాచ్ కాలేదు.. అది ఎప్ప‌టికీ సాధ్యం కాదు.. అని విన‌మ్ర‌త‌ను వ్య‌క్తీక‌రించింది యంగ్ హీరోయిన్‌. అలాంటి మేటి క్లాసిక్ సాంగ్‌లో న‌ర్తించడం అన్న‌ది ప్ర‌తి ఒక్క క‌థానాయిక‌ డ్రీమ్‌. ఇలాంటి పాట‌లో న‌ర్తించే అవ‌కాశం నాకు మాత్రమే ద‌క్క‌డం నా అదృష్టం అని ఆనందం వ్య‌క్తం చేసింది.