వీడియో : ఏక్ దో తీన్.. మెంట‌లెక్కించిన‌ జాక్విలిన్!

Friday, March 16th, 2018, 06:59:59 PM IST

మేటి క‌థానాయిక‌.. డ్యాన్సింగ్ క్వీన్ మాధురి ధీక్షిత్ న‌ర్తించిన పాట‌ను రీమిక్స్ చేయ‌డం.. అందులో ఓ యువ‌క‌థానాయిక అప్పియ‌రెన్స్ ఇవ్వ‌డం అంటే మాట‌లా? అందుకు గుండెల నిండా ద‌మ్ముండాలి. తేడా కొడితే ఉమ్మేస్తారు. ప‌రువు తీసిందంటూ తిట్టిన‌తిట్టు తిట్ట‌కుండా తిడతారు. కానీ అలా వెర‌వ‌కుండా ఎంతో డేర్ చేసి న‌ర్తించింది జాక్విలిన్‌. 1988 క్లాసిక్ హిట్ మూవీ `తేజాబ్‌`లో మాధురి చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్‌ `ఏక్ దో తీన్ … ` రీమిక్స్ లో న‌ర్తించింది. టైగ‌ర్ ష్రాఫ్ – దిశాప‌టానీ జంట‌గా న‌టించిన‌ `భాఘి 2` కోసం జాక్విలిన్ ఈ ఫీట్ వేసింది. మూవీలో ఇది స్పెష‌ల్ సాంగ్‌. తాజాగా ఈ పాట టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. క్ష‌ణాల్లోనే వెబ్‌లో వైర‌ల్ అయిపోయింది. క్ష‌ణాలు, నిమిషాల్లోనే ల‌క్ష‌ల‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది. మాధురి డ్యాన్సుల స్థాయిలోనే క‌వ్వించే నృత్యంతో జాక్విలిన్ ఆక‌ట్టుకుంది. అభిమానుల నుంచి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు అందుకుంటోంది. `భాఘి 2` మార్చి 30న రిలీజ్ కానుంది. అందుకే ఇలా ప్ర‌మోష‌న్స్‌లో దూసుకుపోతోంది టైగ‌ర్ టీమ్‌.