ఏక్తా కపూర్ .. కామసూత్ర సినిమా ?

Tuesday, April 10th, 2018, 10:03:40 AM IST

సంచలన నిర్మాతగా ఇప్పటికే బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న హాట్ ప్రొడ్యూసర్ ఏక్తాకపూర్. ఈమె తీసే సినిమాలు అటు హాట్ గాను .. ఇటు సంచలనం రేపెలా ఉంటాయి. ఏక్తా కపూర్ బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే రసిక హృదయాలు ఆసక్తితో ఎదురుచూస్తాయి .. ఆ రేంజ్ లో ఈ అమ్మడు పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ట్రిపుల్ ఎక్స్ పేరుతొ ఓ హాట్ మూవీ నిర్మిస్తున్న ఏక్తా .. తాజాగా కామసూత్ర నేపథ్యంలో ఓ వెబ్ సిరీస్ నిర్మించే సన్నాహాలు చేస్తుంది. రసిక హృదయాలు కొల్లగొట్టేలా ఈ సినిమా ఉంటుందని బి టౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. డర్టీ పిక్చర్ పేరుతొ విద్యాబాలన్ ను మెయిన్ లీడ్ గా తీసిన సినిమా అప్పట్లో ఓ రేంజ్ సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఆలోచనలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. యూత్ కి సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలు నేర్పాలనే ఆలోచనతో ఈ కామసూత్ర వెబ్ సిరీస్ చేస్తుందట. మంచి దర్శకుడు దొరికితే వెంటనే మొదలు పెడుతుందట. మరి ఈ సినిమా తీసి ఇంకెన్ని సంచలనాలు రేపుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments