బిగ్ న్యూస్: నిమ్మగడ్డ సర్క్యులర్‌ను వెనక్కు తీసుకున్న ఎన్నికల సంఘం..!

Sunday, May 31st, 2020, 03:00:24 AM IST

ఏపీ ఎన్నికల కmeeషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నిన్న తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమీషనర్ పదవీకాలాన్ని తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించినట్టు ప్రకటించుకున్నారు.

అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాం మీడియా ముందుకొచ్చి ఈ కేసుపై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించినట్లు ఇచ్చిన ఉత్తర్వులను ఎన్నికల కమీషన్ కార్యదర్శి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. సమాచారం వచ్చేవరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని వెల్లడించింది.