అత్యవసరంగా దింపేసిన అమిత్ షా హెలికాఫ్టర్ – ఏమైందంటే..?

Saturday, October 19th, 2019, 11:45:54 PM IST

శనివారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్నటువంటి హెలికాఫ్టర్ ని కొన్ని అనివార్య కారణాల వలన అత్యవసరంగా దించేశారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అహ్మద్ నగర్ లోని ఆకోలు ప్రాంతానికి వెళ్తుండగా, అకస్మాత్తుగా వర్షం ప్రారంభం అవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాగా తానూ ప్రయాణిస్తున్నటువంటి హెలికాఫ్టర్ ప్రారంభం అయిన కొద్దీ సేపటికే ఈ ఘటన జరగడంతో నాసిక్‌లోని ఒజర్‌ విమానాశ్రయంలో హెలికాప్టర్‌ను దించినట్లు అధికారులు తెలిపారు. కాగా వర్షం తగ్గిన తరువాత మళ్ళీ హెలికాఫ్టర్ ని ప్రారంభించారు. దాదాపు 40 నిముషాల తరువాత హెలికాఫ్టర్ బయలుదేరింది.