పెళ్లి భాజాకి సిద్ధం : లేడీ రోబో టాప్‌ సీక్రెట్స్ లీక్‌

Saturday, February 17th, 2018, 12:35:29 PM IST

అనుష్క శ‌ర్మ త‌ర్వాత సోన‌మ్ క‌పూర్‌, శ్రుతిహాన్ పెళ్లికి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. బోయ్‌ఫ్రెండ్స్‌తో షికార్లు విషయంలో ప‌బ్లిక్‌కి ఓపెన్ అయిపోయిన ఆ ఇద్ద‌రూ ఏదో ఒక రోజు పెళ్లాడుకోవ‌డం ఖాయం. కొన్నాళ్లపాటు క‌లిసిమెలిసి లైఫ్‌ని ఎంజాయ్ చేయ‌డ‌మే గాకుండా.. ఆ త‌ర్వాత పెళ్లికి ఏర్పాట్లు చేసుకోవ‌డం లేటెస్ట్ ట్రెండ్‌. ఓవైపు సినిమా అవ‌కాశాలు పోకూడ‌దు.. అలాగ‌ని ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని కోల్పోకూడ‌దు అనే ధోర‌ణి క‌నిపిస్తోంది నాయిక‌ల్లో. వినోదానికి వినోదం.. వృత్తి గ‌త సంతృప్తి కోసం శ్ర‌మించ‌డం అన్న పంథా క‌నిపిస్తోంది.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం లండ‌న్ బ్యూటీ ఎమీజాక్స‌న్ త్వ‌ర‌లోనే త‌న బోయ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. ఈ భామ ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా ప‌రిచ‌యం అయిన‌..ఓ మ‌ల్టీబిలియ‌నీర్‌ని పెళ్లాడేందుకు ప్లాన్ చేసింద‌ని తెలుస్తోంది. బ్రిట‌న్‌కి చెందిన స‌ద‌రు బిజినెస్ టైకూన్ వార‌సుడితో గ‌త కొంత‌కాలంగా చెట్టాప‌ట్టాల్ అంటూ షికార్లు చేస్తోంది. మూడేళ్లుగా అత‌డితో వీలున్న ప్ర‌తిచోటా షికార్లు చేస్తోంది. ఇంత‌కీ ఎవ‌రు ఇత‌గాడు? అంటే.. బిలియ‌నీర్ జార్జ్ ప‌న‌యిటౌ… బ్రిట‌న్‌లో ది గ్రేట్ రియ‌ల్ ఎస్టేట్ కింగ్ ఆండ్రియాస్ పాన‌యిటౌ కుమారుడు. ఇటీవ‌లే క‌రీబియ‌న్ దీవుల్లో అత‌డితో షికారుకు వెళ్లి ఓ రేంజులో ఎంజాయ్ చేసింది. అక్క‌డి నుంచి కొన్ని ఫోటోల్ని అప్ప‌ట్లో లీక్ చేసింది ఎమీ. ఎమీజాక్స‌న్‌పై ప్ర‌ఖ్యాత ముంబైమిర్ర‌ర్ ప్ర‌చురించిన క‌థ‌నం ప్ర‌ముఖంగా హైలైట్ అయ్యింది.

A post shared by Amy Jackson (@iamamyjackson) on

A post shared by Amy Jackson (@iamamyjackson) on