నిగ‌నిగ‌ల నిమ్మ పండు తెంప‌క‌లా!

Monday, May 7th, 2018, 09:49:59 PM IST

ప‌సుపు వ‌ర్ణంలో నిగ‌నిగ‌లాడుతున్న నిమ్మ పండును తెంపేస్తున్న ఆ చిన్న‌ది ఎవ‌రో తెలుసా? ది గ్రేట్ బ్రిటీష్ ఎంప‌ర‌ర్‌కి కాబోయే కోడ‌లు, ఫేమ‌స్ బిజినెస్‌మేన్ జార్జ్‌కి కాబోయే పెళ్లాం. ఆవిడే ఎమీ జాక్స‌న్‌. అయితే అంత ఖ‌రీదైన ఆవిడ ఇలా నిమ్మ తోట‌లో దొంగ‌త‌న‌మేంటి? అంటారా? అయితే పాయింట్‌లోకి వెళ్లాలి.

లండ‌న్‌లో ప్ర‌ఖ్యాత రియ‌ల్ ఎస్టేట్ య‌జ‌మాని కొడుకు, బిలియ‌నీర్ ని ప్రేమించిన ఈ అమ్మ‌డు త్వ‌ర‌లోనే పెళ్లాడేందుకు రెడీ అవుతోంద‌ని వార్త‌లొచ్చాయి. స‌ద‌రు బోయ్‌ఫ్రెండ్‌తో త‌న‌కు న‌చ్చిన‌ట్టు షికార్లు చేస్తూ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ఓవైపు అడపాద‌డ‌పా ఇక్క‌డ క్రేజీ సినిమాల్లో న‌టిస్తూ బాగా సంపాదించుకుని, అటు బోయ్‌ఫ్రెండ్‌తో షికార్ల‌కు వెళ్లి న‌చ్చిన‌ట్టు ఎంజాయ్ చేస్తోంది. మ‌రోవైపు హాలీవుడ్‌లో త‌న‌కు అవ‌కాశాలు తెచ్చే సూప‌ర్‌గాళ్ సిరీస్‌తో పెద్ద గేమ్ ప్లాన్‌ని రెడీ చేసింది. అయితే ఎమీకి కాస్తంత ఖాళీ స‌మ‌యం చిక్కిన‌ట్టుంది. ఇలా నిమ్మ తోట‌లో కాయ‌, పండుతో చెల‌గాట‌మాడుతోంది. ఈ భామ న‌టించిన 2.ఓ రిలీజ్‌కి రావాల్సి ఉందింకా.