షాకింగ్ : హైదరాబాద్ లో ఇంజినీరింగ్ అమ్మాయిల వ్యభిచారం

Tuesday, September 27th, 2016, 05:10:32 PM IST

prostitutes
వ్యభిచారం ఇప్పుడు కార్పరేట్ స్థాయి లో పెద్ద వ్యాపారం అయిపొయింది. ఉద్యోగం కోసం ఎదురు చూసే ఆడపిల్లల్ని తెలివిగా వలలో వేసుకుని కొన్ని ముఠాలు ప్రేమ పేరుతో ఇందులోకి దింపుతున్నాయి. ఉద్యోగం ఇస్తాం అని కొందరు , పెళ్లి చేసుకుంటాం అని మరికొందరు ముఠాలు గా విడిపోయి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాయి. అలాంటి ఒక ముఠా గుట్టు రట్టు అయ్యింది. రాచకొండ సర్కిల్ ఎస్ వోటి పోలీసులకి తెలిపిన వివరాల ప్రకారం డిల్లీ నుంచి 8 మంది అమ్మాయిలని లోకంటో అనే వెబ్ సైట్ ద్వారా విటులకి వల వేస్తున్నారు. . ఈ వెబ్సైటు మీద పోలీసులు ఒక కన్ను వేసి దీని నిర్వాహణ ఎవరు చేస్తున్నారు తదితర వివరాలు కనుక్కోవడం తో వీరిని పట్టుకోవడం తేలిక అయ్యింది. ఇద్దరు నిర్వాహకులు, ఎనిమిది మంది అమ్మాయిలు ఈ దాడిలో దొరికారు. దొరికిన అమ్మాయిలలో నలుగురు అమ్మాయిలు ఇంజినీరింగ్ చదువుతున్నట్టు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అదుపులోకి తీసుకున్న యువతులను ప్రభుత్వ రెస్క్యూ హోంకు తరలించినట్లు సమాచారం.