ఫోర్త్ టెస్ట్: లంచ్ బ్రేక్ కి ఇంగ్లాండ్ 74/3

Thursday, March 4th, 2021, 12:40:58 PM IST

ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా బౌలర్లు కష్టపడుతున్నారు. ముప్పై పరుగులకు మూడు వికెట్లు పడగొట్టి భారత్ కి శుభారంభం ను ఇచ్చింది. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ను అక్షర పటేల్ 21 పరుగులకు 2 వికెట్లు తీసి, సిరాజ్ 23 పరుగులకు ఒక వికెట్ తీసి గట్టి దెబ్బ కొట్టారు. ఇద్దరు ఓపెనర్లను అక్షర్ పటేల్ పెవిలియన్ కి పంపగా, కెప్టెన్ జో రూట్ ను సిరాజ్ ఔట్ చేశాడు. అయితే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్ ను బెయిర్ స్టో, బెన్ స్టాక్స్ ఆదుకుంటున్నారు. 44 పరుగుల భాగస్వామ్యం తో తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ విరామానికి ఇంగ్లాండ్ 74 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. బెయిర్ స్టో 28 పరుగులతో, బెన్ స్టాక్స్ 24 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు.