భారతీయుల వంట వాసనను మేము భరించలేము..కోర్టుకెక్కిన ఇంగ్లాండ్ వ్యక్తి

Saturday, November 11th, 2017, 01:00:00 AM IST

ప్రస్తుతం విదేశాల్లో భారతీయలు ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడాదికి లక్షల సంఖ్యల్లో ఇండియా నుంచి విదేశాలకు పర్మినెంట్ గా వెళ్లిపోతున్నారు. ఇతర దేశాలు మన టెక్కీలను ఎంతో ఇష్టపడుతున్నాయి కూడా.. ఇకపోతే ఇతర దేశాల్లో వివిధ కార్మికులుగా చిరు ఉద్యోగులుగా వర్క్ చేస్తున్నారు. అయితే కొందరు భారతీయులు అక్కడి ఆహారానికి పూర్తిగా అలవాటు పడలేకపోతున్నారు. దీంతో మసాలాలు ఘాటుగా ఉండే కూరలను చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలాగే పాకిస్థాన్ దేశస్థులు కూడా అలాంటి ఫుడ్ నే ఎక్కువగా తింటారు.

అయితే బ్రిటన్ లో ఒక వ్యక్తి భారతీయులు అలాగే పాకిస్థాన్ వంటి దేశాలకు చెందిన వ్యక్తులు ఎక్కువగా మసాలా ఘాటును రేపుతున్నారని ఆ వాసనకి ఇళ్లు మొత్తం ఘాటుగా ఉంటోందని వారికి ఇళ్లను అద్దెకివ్వకూడదనే నెపంతో మానవ హక్కుల కమిషన్‌ ముందు ఆయన గుట్టుగా చెప్పాడు. ఇంగ్లాండ్ లో 69ఏళ్ల ఫెర్జస్‌ విల్సన్‌కు వందల కొద్దీ ఇళ్లున్నాయి. చాలా వరకు అద్దెలకు ఇల్లు ఇస్తుంటాడు. అయితే అక్కడ భారతీయులు ఎక్కువగా నివాసం ఉంటున్నారు. అయితే ఇక నుంచి భారత్ – పాక్ దేశాలకు చెందిన వ్యక్తులకు అద్దెకు ఇవ్వనని చెప్పాడు. దీంతో అక్కడి మైడ్‌స్టోన్‌ కౌంటీ కోర్టు అతను జాత్యహంకారాన్ని చూపిస్తున్నాడని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇది అర్ధం లేని వాదన అని ఈ విషయాన్ని ఇంతటితో వదిలెయ్యాలని లేకుంటే జైలు కెళ్లాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. కానీ అతను మాత్రం వారి వంటల వల్ల ఇల్లు పదవుతున్నాయని ఆరోపిస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments