కోటపై ఎగారేసాకే కొరివి బుద్దోచ్చింది

Friday, September 12th, 2014, 06:10:51 PM IST


తెలంగాణ తెలుగుదేశం నేత ఎర్రబిల్లి దయాకర్ రావు శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన తర్వాతే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు నిరంకుశ బుద్ధులోచ్చాయని తీవ్రంగా విమర్శించారు. ఇక అందుకే ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎర్రబిల్లి దుయ్యబట్టారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఒక్క కెసిఆర్ కుటుంబానికే ‘బంగారు తెలంగాణ’ కనబడుతోందని ఎద్దేవా చేశారు. అలాగే కెసిఆర్ కి గనుక దమ్ముంటే అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలని ఎర్రబిల్లి డిమాండ్ చేశారు. ఇక కెసిఆర్ అధికారంలోకి వచ్చి వంద రోజుల పాలన ముగిసినా గ్రామాలలో ఇంకా ఏ పనీ పూర్తికాలేదని, సర్పంచ్ లకు వర్తించే నిబంధనలు కెసిఆర్ కు వర్తించవా? అంటూ ఎర్రబిల్లి దయాకర్ రావు నిప్పులు చెరిగారు.