ఆర్టీసీ సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, October 8th, 2019, 11:11:01 PM IST

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసిన సమ్మెను విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ తేల్చి చెప్పడంతో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్టీసీ అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీనీ మొత్తం మూడు రకాలుగా విభజిస్తూ 50% బస్సులు ఆర్టీసీ నడుపుతుందని, 30% బస్సులు అద్దెవి నడుపుతామని, మరో 20% బస్సులు పూర్తిగా ప్రైవేట్ బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందించారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల ఛార్జీలు ఒకేలా ఉంటాయని, ఆర్టీసీ యూనియన్ల అతి ప్రవర్తన వలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను తొలగించలేదని, చెప్పిన మాట వినకుండా వారే సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని అన్నారు.

అయితే సీఎం తీసుకున్న నిర్ణయంపై అటు జేఏసీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఆర్టీసీ సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందిస్తూ నేడు మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు తప్పు తెలుసుకుని విధులలో చేరడానికి ప్రభుత్వాన్ని కోరాలని కార్మికులు యూనియన్ నేతల మాటలు నమ్మి మోసపోకండి అని అన్నారు. పండుగ వేళ ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు సమ్మెకు మద్ధతు ఇస్తున్నది కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ కార్మికులకు చెల్లించని స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం జీతాలు ఇస్తుందని బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేశారా అని ప్రశ్నించారు.