దిశ ఎన్‌కౌంటర్‌పై మంత్రి ఈటెల సంచలన వ్యాఖ్యలు..!

Sunday, December 15th, 2019, 12:11:57 AM IST

దిశ హత్య కేసుకు సంబంధించి నలుగురు నింధితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపిన సంగతి తెలిసిందే. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను దిశను చంపిన సంఘటన స్థలం చటాన్‌పల్లి వద్దకు తీసుకుని వెళ్ళగా వారు పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే దిశ లాంటి ఘటనలలో ఎన్‌కౌంటర్లు, ఉరిశిక్షలు పరిష్కారం కాదని అన్నారు. అయితే ఇలాంటివన్ని తాత్కాళిక పరిష్కారాలే అని ఇలా చేస్తే సమాజంలో మార్పు రాదని, నిజంగా సమాజంలో మార్పు వస్తేనే ఇలాంటి హత్యలు జరగవని అన్నారు. సెల్‌ఫోన్లు, టీవీలు, టెక్నాలజీ జీవితాన్ని విద్వంసం చేస్తున్నాయని, తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తుపై భయమేస్తుందన్నారు. ఆడపిల్లలు భయటికి వెళ్తే క్షేమంగా వస్తారన్న నమ్మకం లేదని, ముందు ఆ నమ్మకాన్ని వారిలో కలిగించాలని అన్నారు.