చాపకింద నీరులా కరోనా విస్తరిస్తోంది – మంత్రి ఈటెల రాజేందర్!

Tuesday, July 28th, 2020, 08:40:02 PM IST

కరోనా వైరస్ మహమ్మారి చాపకింద నీరులా ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది అని మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. మానవ మనుగడ కె సవాల్ గా మారింది అని వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అని అన్నారు. అయితే లక్షణాలు లేకుండా నే కరోనా వ్యాప్తి చెందుతుంది అని, అలా 81 శాతం మంది కరోనా నుండి కోలుకున్నారు అని అన్నారు.

అయితే కరోనా వైరస్ ను సకాలం లో గుర్తించని వారికి ప్రమాదకర పరిస్థితులు వస్తున్నాయి అని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. కరోనా సోకింది అని భయపడకుండా ప్రజలు దైర్యం గా ఎదుర్కోవాలి అని అన్నారు. అయితే లక్షణాల తో బాధపడే వారు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి అని సూచించారు. అంతేకాక గతం లో ఎన్నో ప్రమాదకర వైరస్ లను ఎదుర్కొన్న సత్తా మనది అని ఈటెల రాజేందర్ గుర్తు చేశారు.