బిగ్ న్యూస్: వాక్సినేషన్ మరియు లాక్ డౌన్ ల పై మంత్రి ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

Thursday, April 29th, 2021, 04:14:33 PM IST

ఆక్సిజన్ లేక కరోనా రోగులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అయితే ఆక్సిజన్ లేక కరోనా రోగులు ప్రాణాలను కోల్పోవడం దేశానికే అవమాన కరం అంటూ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అవసరం అయిన ఆక్సిజన్ ను కేంద్రం యుద్ద ప్రాతిపదికన సరఫరా చేయాలి అంటూ కోరారు. వాక్సిన్ డోసుల ఉత్పత్తి సైతం పెరగాలి అంటూ సూచించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాక్సిన్ లేకపోతే అంతా గందరగోళం అవుతుంది అని అధికారులు చెబుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే మే 1 వ తేదీ నుండి 18 ఏళ్లు నిండిన వారికి సైతం వాక్సిన్ వేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రం లో 18 నుండి 44 ఏళ్ల మద్యన ఉన్న వారికి మొత్తం 3.4 కోట్ల డోసు లు కావాలి అని తెలిపారు. అయితే రెండు కంపనీ ల ఉత్పత్తి 6 కొట్లే అని చెప్పుకొచ్చారు. అయితే ఈ వాక్సిన్ విషయం లో కేంద్రం ప్రణాళికను ప్రకటించాలి, ఉచితంగా టీకా ఇవ్వాలి అంటూ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

అంతేకాక కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పట్ల మంత్రి ఈటెల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందుగానే అప్రమత్తం చేస్తే రాష్ట్రాలకు నేడు ఈ పరిస్తితి వచ్చేది కాదు అని అన్నారు. అంతేకాక వాక్సిన్ లు మరియు ఇంజెక్షన్ల సరఫరా విషయం లో కేంద్రానికి ముందు చూపు లేదని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనా కేసులు మరియు మరణాల పై తప్పుడు వార్తలు ఇస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాక తెలంగాణలో లాక్ డౌన్ ఆలోచన లేదని మరొకసారి స్పష్టం చేశారు.