ఎమ్మెల్యే పదవికి రేపే రాజీనామా చేయనున్న ఈటెల…బీజేపీ ముఖ్యనేతలతో నేడు భేటీ!

Friday, June 11th, 2021, 04:05:00 PM IST

etela
తెలంగాణ రాష్ట్ర మాజి మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రేపు రాజీనామా చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ వద్ద అమర వీరులకి నివాళులు అర్పించనున్నారు. అక్కడి నుండి అసెంబ్లీ కార్యదర్శి కి తన రాజీనామా లేఖను ఇవ్వనున్నారు ఈటెల రాజేందర్.అయితే ఈ నెల 14 వ తేదీన ఈటెల రాజేందర్ బీజేపీ లో చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రం లో కీలక బీజేపీ నేతలు ఈటెల నివాసం కి చేరుకొని భేటీ కానున్నారు. అయితే బీజేపీ లో ఈటెల కి ఇవ్వబోయే ప్రాధాన్యత తెలియ జేయడానికి బీజేపీ నేతలు ఈటెల రాజేందర్ నివాసం కి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం ఈ భేటీ కి హాజరు కాలేదు. అతని గన్ మెన్ కి కొవిడ్ రావడం తో బండి సంజయ్ హోం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈటెల రాజేందర్ తో పాటుగా మాజి కీలక నేతలు అయిన ఏనుగు రవీందర్ రెడ్డి, ఉమా మరికొందరు బీజేపీ లో చేరనున్నారు.