బీజేపీ లో చేరికకి ముహూర్తం ఫిక్స్ చేసిన ఈటెల రాజేందర్

Monday, June 7th, 2021, 10:02:15 AM IST

Etela_Rajendar
తెలంగాణ రాష్ట్రం లో అధికార పార్టీ తెరాస లో ఉన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తాజాగా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మంగళవారం లేదా బుధవారం రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రం కోసం అమరులు అయిన వారికి గన్ పార్క్ అమర వీరుల స్తూపం వద్ద నివాళి అర్పించి రాజీనామా పత్రాన్ని స్పీకర్ కి అందజేయనున్నారు. లేని పక్షంలో కార్యాలయం లో రాజీనామా పత్రాన్ని ఇవ్వనున్నారు. అయితే రాజీనామా అనంతరం బీజేపీ లో చేరిక పై ఈటెల ఆలోచించనున్నారు. ఈ నెల 13 న లేదా 14 వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ద్వారా జేపీ నడ్డా సమక్షం లో చేరనున్నారు. అయితే ఈటెల రాజేందర్ తో పాటుగా ఏనుగు రవీందర్ రెడ్డి,తుల ఉమా మరికొందరు బీజేపీ లో చేరనున్నారు. అయితే తెరాస మాత్రం ఈటెల రాజేందర్ పై మరియు అతను అనుచరుల పై వరుస విమర్శలు గుప్పిస్తుంది.