వీడ్కోలు పలకనున్న ఈటీవీ స్టార్ మహిళా ప్రోగ్రామ్

Thursday, January 10th, 2019, 07:18:28 PM IST

దాదాపుగా 12 సంవత్సరాలనుండి ఎంతోమంది ప్రేక్షకులని అలరిస్తున్నటువంటి మన ఈటీవీ స్టార్ మహిళా ప్రోగ్రామ్ ఈ వారం తో ముగియనుంది… దాదాపు 3100 పైచిలుకు ఎపిసోడ్లను విజయవంతంగా ముందుకు నడిపించినటువంటి సుమ గారు ఈ చివరి వారం ఎపిసోడ్లలో ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ చివరి వారాంతంలో చాలామంది సెలబ్రిటీస్ ని తమ వేదికపైకి పిలిపించుకుని, ఎంతో సందడి సందడిగా గడుపుతూ చివరికి, ఇక ఈ షో ముగింపు పలకానుందని చాలా ఎమోషనల్ అయ్యారు. తనతో పాటు వచ్చిన సెలబ్రిటీస్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఇక మీదట సుమ చేసే అల్లరి మనకు దూరమవబోతుంది.