ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా కేబినెట్ పదవి వచ్చిందిగా

Saturday, August 17th, 2019, 01:26:08 AM IST

తెలంగాణాలో జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా తనమీదున్న నమ్మకంతో తనకు కేబినెట్ పదవి రావడం పట్ల తెరాస నేత వినోద్ కుమార్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ నుండి ఓడిపోయిన వినోద్ కి అనూహ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ హోదా కలిగిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు పదవిని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కట్టబెట్టారు. కాగా ప్రస్తుతానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షులుగా ముఖ్యమంత్రి చేసుకుంటుండగా, ఉపాధ్యక్షుడు వంటి కీలకమైన పదవిని ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి రావడం పట్ల తెరాస వర్గాల్లో చాలా వ్యతిరేకత మొదలైందని చెప్పాలి. అయితే వినోద్ కుమార్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న నమ్మకం కారణంగానే తనకి ఈ పదవి వచ్చిందని పలువియూరు రాజకీయ వేత్తలు చెబుతున్నారు.

ఇకపోతే రాజకీయాల్లో, పాలన అంశాల్లో వినోద్ కు అనుభవంతో పాటు, తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, సామాజిక, ఆర్థిక, తదితర అంశాల మీద తనకు గట్టి పట్టు ఉండటం కూడా ఒక కారణమని చెబుతున్నారు. అంతేకాకుండా బడ్జెట్ కు సంబంధించిన అన్ని శాఖలని సమీక్షించి చివరికి ఒక చక్కని రూపం ఇచేలా చేయాలనీ కెసిఆర్ గారు వినోద్ కి ఈ బాధ్యతలను అదనంగా వేశారని సమాచారం.