బిగ్ బ్రేకింగ్ : సన్నిహితులనే ఇరకాటంలో పెట్టేసిన గంటా.!

Wednesday, August 14th, 2019, 10:39:20 AM IST

ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎటు పోతుందో అన్నది ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానంతో పాటుగా ఇక్కడి ప్రజలకు కూడా అర్ధం కావడం లేదు.జగన్ “ఫ్యాన్” గాలి దెబ్బకు సైకిల్ ఘోరంగా దెబ్బ తినేసింది.దీనితో తమ పార్టీను మళ్ళీ ఎలా అయినా సరే పూర్వస్థితికి తెచ్చుకోవాలని చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నా తెలుగు తమ్ముళ్లు మాత్రం అందుకు అసలు అవకాశం ఇవ్వడం లేదు.ఇప్పటి వరకు ఆ పార్టీకు ఎవరు బలమని అంతా అనుకున్నారో ఇప్పుడు వారే టీడీపీను భూస్థాపితం చేసేసేలా ఉన్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అయితే ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత పక్క పార్టీలోకి ఆపార్టీ ఎమ్మెల్యే అయినటువంటి గంటా శ్రీనివాసరావు ఖచ్చితంగా జంప్ అయ్యిపోతారని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి.ఒకవేళ క్యాబినెట్ హోదా కానీ తనకి కల్పించినట్టైతే టీడీపీలో కొనసాగుతారన్న వార్తలొచ్చాయి.కానీ అది కూడా దక్కకపోవడంతో గంటా ఇప్పుడు టీడీపీకు కాస్త దూరంగా జరుగుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.

అలాగే వైసీపీలో చేరనున్నారు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నా సరే గంటా మాత్రం ఏం చేస్తున్నారు అన్నది అతని సన్నిహిత వర్గాలకు కూడా పాలుపోవడం లేదని తెలుస్తుంది.గంటా వైసీపీలోకి చేరుతారా లేదా అన్న విషయం కోసం తన సన్నిహితులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక వార్త వినిపిస్తుంది.మరి గంటా ఏం చేస్తారో చూడాలి.