ఏపీ 16ఇఎ 2425 నంబరు ప్లేటు ఉన్న బజాజ్ చేతక్.. పెద్ద సర్‌ప్రైజ్‌నిచ్చింది కదూ? ఆ బండిపై అల్లు వారు మరింత పెద్ద సర్ప్రైజ్. అయితే ప్రతి సర్ప్రైజ్ వెనకా ఓ కథ ఉంటుంది! 2425 నంబర్ హరీష్‌కి సెంటిమెంటా? అంటే అవుననే చెప్పాలి. తాజాగా రిలీజైన డీజే-దువ్వాడ జగన్నాథమ్ పోస్టర్లో పాత మోడల్ బజాజ్ చేతక్‌పై నంబర్ ప్లేట్ పరిశీలిస్తే అందులో 2425 నంబర్ కనిపిస్తుంది. ఇదివరకే `గబ్బర్‌సింగ్` కోసం హరీష్ సేమ్ నంబర్ ప్లేట్ ఉపయోగించాడు. అంతేనా హరీష్ శంకర్ రియల్ లైఫ్‌లోనూ ‘2425’తో రిజిస్ట్రర్ చేయించిన కారును వాడుతారట. అది తన సెంటిమెంట్ నంబర్. అందుకే ఇలా రిపీటవుతోందన్నమాట!