రోహిత్ శర్మ ప్రశ్నకు యువరాజ్ దిమ్మ తిరిగే సమాధానం!

Wednesday, April 8th, 2020, 07:00:52 PM IST

మాజీ క్రికెటర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మరియు ఇండియన్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ మద్య ఆసక్తికర చర్చ జరిగింది. ప్రస్తుతం టీం ఇండియా లో సీనియర్ ఆటగాళ్ళు అయిన విరాట్ కోహ్లి మరియు రోహిత్ శర్మ లకు జట్టులో ఉన్న కుర్రాళ్ళ నుండి అనుకున్న స్థాయిలో గౌరవం లభించడం లేదు అని యువరాజ్ సింగ్ ఆరోపించారు. అయితే రోహిత్ శర్మ , యువరాజ్ కి వేసిన ప్రశ్న కి సమాధానం గా పై విధమైన వ్యాఖ్యలు చేశారు. ఇపుడున్న జట్టుకు, అప్పటి జట్టుకు తేడా ఏమిటి అన్న విషయం పై పలు వ్యాఖ్యలు చేశారు. యువి, రోహిత్ జట్టులోకి వచ్చినపుడు సీనియర్ ఆటగాళ్లు ఎంతో క్రమశిక్షణ తో ఉండేవారు అని అన్నారు. టీం లో ఉన్న ప్రతి ఒక్కరినీ సమాన స్థాయిలో చూసేవారు అని,అయితే అందుకు అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం కూడా అంతగా లేదు అని వ్యాఖ్యానించారు. అయితే టీం లోని సీనియర్ ఆటగాళ్లను గౌరవిస్తూనే వారి మార్గదర్శకం లో నడి చేవాళ్ళం అని అన్నారు.అంతేకాక సీనియర్ ఆటగాడు మీడియా తో ఎలా మాట్లాడాలి, వారు అడిగే ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం ఇవ్వాలి అని నేర్చుకున్నాం అని తెలిపారు.అందుకే అప్పటి జట్టు ఆటగాళ్ళు అందరూ ఆటకి అంబాసిడర్ లుగా మారారు అంటూ కితాబిచ్చారు.

అయితే ప్రస్తుతం మూడో జనరేషన్ లో ఉన్న కోహ్లీ, రోహిత్ శర్మ లు తప్ప సీనియర్ ఆటగాళ్లు లేరు, వీరు అన్ని ఫార్మాట్ లలో ఆడుతున్నారు అని, మిగతావారు మాత్రం రాణించడం లేదు అని అనవసరం వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే దీనికి బదులుగా రోహిత్ శర్మ నేను జట్టులోకి వచ్చేసరికి జట్టులో చాలా మంది సీనియర్‌ ఆటగాళ్లు ఉండేవారు అని అన్నారు. పీయూష్‌ చావ్లా, సురేశ్‌ రైనాలతో పాటు నేను మాత్రమే జూనియర్‌ ఆటగాళ్లగా ఉన్నాం అని తెలిపారు. కానీ ఇప్పుడు నేను సీనియర్‌ హోదా సంపాధించిన తర్వాత జట్టులోని యువ ఆటగాళ్లతో మంచి సంబంధాన్ని కొనసాగించా అని అన్నారు. రిషబ్‌ పంత్‌ విషయంలో మీడియాలో ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. కానీ నిజానికి రిషబ్‌ను నేను చాలా దగ్గర్నుంచి గమనించాను. అతని మాట తీరు నాకు చాలా బాగా అనిపించేది. అందుకే రిషబ్‌ గురించి రాసేముందు మీడియా నిజానిజాలు తెలుసుకోవడం మంచిదని అన్నారు. అయితే ఇప్పటి ఆటగాళ్ళు పరిమిత ఆట కి, టీ 20 మ్యాచ్ లకు తప్ప, సంప్రదాయ టెస్ట్ క్రికెట్ నీ అంతగా ఇష్ట పడటం లేదు అని యువరాజ్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.