బాబోయ్ .. మరో కొత్త అత్త ఎంట్రీ ?

Friday, April 13th, 2018, 10:15:57 AM IST


టాలీవుడ్ లో అత్త పాత్రలకు కొదవే లేదు .. ఒకప్పుడైతే అత్తకు .. అల్లుడికి మధ్య గట్టి పోరు ఉండేది .. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమాలు మంచి విజయాలుగా నిలవడంతో అత్త పాత్రలకు క్రేజ్ దక్కింది. అంతకంటే మరో అడుగు ముందుకేస్తే .. అసలు అత్త పాత్ర అనగానే సూర్యకాంతం గుర్తొచ్చే రేంజ్ లో ఆమె ఆయా పాత్రల్లో జీవించేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మళ్ళీ అత్త పాత్రలకు గిరాకీ బాగా పెరిగింది. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటిది దారేది సినిమాతో మళ్ళీ వీళ్ళ హవా మొదలైంది. సరే ఈ కథంతా దేనికంటే .. తాజాగా అత్తా పాత్రలో ఎంట్రీ ఇస్తుంది మాజీ గ్లామర్ హీరోయిన్ సిమ్రాన్ ? 90 వ దశకంలో సిమ్రాన్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా తనదైన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఈ మద్యే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయినా ఈమె మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా తమిళంలో శివ కార్తికేయన్, సమంత జంటగా పోనారామ్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో సిమ్రాన్ కీ రోల్ పోషిస్తుందట. అందులో ఆమె అత్తా పాత్రలో కనిపిస్తుందని, ఆమెకు జోడిగా మలయాళ నటుడు లాల్ నటిస్తున్నాడట. దాంతో పాటు తెలుగులో సప్తగిరి హీరోగా ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో కూడా సిమ్రాన్ నటిస్తుంది. అత్తా – అల్లుడి మధ్య వైరం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందంట. మరి గ్లామర్ హీరోయిన్ గా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న సిమ్రాన్ అత్తగా ఎలా అలరిస్తుందో చూడాలి.