నాటి అందాల నాయకి మళ్ళీ వస్తుంది ?

Wednesday, April 25th, 2018, 03:54:00 PM IST

ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ పెళ్లి చేసుకుని, కొన్నాళ్ల తరువాత మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆచారం ఇప్పటిది కాదు .. నాటినుండి వస్తున్నదే. ఇక తాజాగా నదియా, భూమిక, ఖుష్భు, మీనా, ఇలా చాలా మంది రీ ఎంట్రీ ఇచ్చేసారు. తాజగా మరో మాజీ భామ రీ ఎంట్రీ కి రెడీ అయింది. అప్పట్లో అందాల చందమామ గా టాలీవుడ్ లో ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకుంది. అప్పటి కుర్రకారు హృదయాలను దోచేసిన హీరోయిన్ అంజలా జవేరి. స్టార్ హీరోల సరసన నటించి సూపర్ హిట్స్ అందుకున్న ఆమె చాల రోజులు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయినా ఈమే మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది. తెలుగులో మంచి కథలతో వస్తే నటించేందుకు ఓకే అని చెప్పకనే చెబుతుంది. తాజగా ఓ సందర్బంగా ఆమె తనకు మళ్ళీ సినిమాల్లోకి రావాలని ఉందన్న విషయాని తెలుపడంతో .. అంజలా జవేరి రీ ఎంట్రీ కి సిద్ధం అయినట్టే .

  •  
  •  
  •  
  •  

Comments