రేవంత్ సీఎం అవ్వటం ఖాయమంటున్న మీడియా అధినేత

Thursday, September 19th, 2019, 07:26:43 AM IST

ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రేవంత్ రెడ్డి దానిని అందుకోవటానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. దీనితో జాగ్రత్తగా అడుగులు వేస్తూ, తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అధిష్టానం మొప్పు పొందటం కోసం తెరాస మీద పలు ఆరోపణలు చేస్తున్నాడు, అవేమి ఆషామాషి ఆరోపణలు కాదు. వాటిలో చాలా విషయమే ఉంది. అయితే వాటి వెనుక రేవంత్ రెడ్డి కోసం ఒక కీలక మీడియా అధినేత పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.

ఒకప్పుడు అగ్రగామి మీడియా సంస్థ అధినేతగా ఒక వెలుగు వెలిగిన ఆయన, ఈ మధ్య కాలంలో రోడ్డున పడ్డాడు. జైలు అంటూ కేసు అంటూ నాన రచ్చ జరిగింది. ఎలాగోలా వాళ్ళని వీళ్ళని పట్టుకొని వాటి నుండి మెల్లగా బయటపడ్డాడు. ఇక తనపై పగ తీర్చుకున్న కేసీఆర్ మీద, ఆయనకి అత్యంత సన్నిహితుడు మీద ఆ మాజీ మీడియా అధినేత బాగా కక్ష పెంచుకున్నాడు. వాళ్ళకి చెక్ పెట్టాలని బీజేపీ సపోర్ట్ అడిగాడు. వాళ్ళు సరిగ్గా స్పందించకపోవటంతో రేవంత్ రెడ్డి దగ్గరకి వచ్చాడు.

రేవంత్ రెడ్డికి కూడా కెసిఆర్ ఆయన సన్నిహితుడు అంటే కూడా పడదు. దీనితో రేవంత్ రెడ్డికి ఆ మాజీ మీడియా అధినేత సపోర్ట్ చేస్తూ ఎలాగైనా రేవంత్ రెడ్డిని సీఎం చేయాలనీ కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగా రేవంత్ రెడ్డికి బ్యాక్ ఎండ్ కంటెంట్ సపోర్ట్ ఇస్తున్నాడు. అలాగే తనకి ఉన్న మీడియా పరిచయాలతో రేవంత్ రెడ్డికి వ్యక్తిగత ఇమేజ్ పెరిగేలా ప్లాన్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి సీఎం అయితే తన పూర్వ వైభవం వస్తుందని ఆ మీడియా అధినేత ఎదురుచూస్తున్నాడు.