మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు మృతి

Friday, April 16th, 2021, 08:54:57 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయవాడ నియోజక వర్గ మాజీ శాసన సభ సభ్యుడు, సీపీఐ సీనియర్ నేత కాకర్లపూడి సుబ్బరాజు కన్నుమూశారు. అయితే విజయవాడ లోని తన నివాసం లో అర్థరాత్రి తనకు గుండెపోటు రావడం తో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆయన భౌతిక కాయాన్ని మార్చురీ లో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే అమెరికా నుండి కుమారుడు, కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బందువులు తెలిపారు. అయితే విజయవాడ నగర పాలక సంస్థ డిప్యూటి మేయర్ గా, సీపీఐ అనుబంధ సంస్థలలో వివిధ హోదాల్లో ఆయన ప్రజలకి సేవ అందించారు. అయితే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము ఉన్నప్పుడు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా పని చేసి సేవలు అందించారు. అయితే ఆయన మృతి పట్ల రాజకీయ నాయకులు, ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.