ట్రంప్ పై విమర్శలతో విరుచుకుపడ్డ పేస్ బుక్ సీఈఓ !!

Sunday, January 29th, 2017, 12:22:56 PM IST

facebook-ceo
అమెరికాకు పలు ముస్లిం దేశాల నుంచి వలస దారులు రాకుండా డోనాల్డ్ ట్రంప్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు ట్రంప్ నిర్ణయంపై మండిపడుతున్నారు. పేస్ బుక్ సీఈఓ మార్క్ జుకెర్ బర్గ్ కూడా ట్రంప్ నిర్ణయం పై నిరసనని వ్యక్తం చేశారు.

”అమెరికా వలస దారుల దేశం. అందుకు గర్వపడాలి. చాలా మంది లాగే నేనుకూడా ట్రంప్ నిర్ణయంపై ఆందోళన చెందుతున్నా” అంటూ జుకెర్ బర్గ్ అన్నారు. మనది వలస దారుల దేశమని, ప్రపంచం లోని అత్యున్నతమైన వారికీ ఇక్కడ నివసించే అవకాశం ఇస్తే మనదేశానికే మంచి జరుగుతుందని అన్నారు. తన తాత, ముత్తాతలు జర్మనీ, పోలెండ్ దేశాలనుంచి వలస వచ్చిన వారే అని మార్క్ జుకెర్ బర్గ్ అన్నారు.