ఫేస్ బుక్ లో చాటింగ్ చెయ్యట్లేదు అని ఇంటికొచ్చి కత్తితో పొడిచాడు

Wednesday, September 28th, 2016, 03:57:04 PM IST

murder
ఫేస్ బుక్ – ఉదయం లేచిన దగ్గర నుంచే ఈనాటి యువత గడిపే ప్రతీ నిమిషం ఈ సోషల్ నెట్వర్కింగ్ లోనే కొట్టుకుపోతోంది. పనులు మానుకుని , ఉద్యోగాల్లో దృష్టి పెట్టక , చదువు పక్కకి పడేసి నేటి యువత దీనివైపు ఎంతగా ఆకర్షితులు అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉదయం లేవడం తోనే ఫేస్ బుక్ నోటిఫికేషన్ లు చూసుకోకపోతే రోజు గడవని పరిస్థితి అందరిదే. అలాంటి వ్యవహారాల్లో ఎన్నో మోసాలు , కుట్రలూ , వేధింపులు జరుగుతూనే ఉంటాయి. ఫేస్ బుక్ లో ఒక అమ్మాయి పేరుతో కుర్రాడు చాటింగ్ చేసాడు. మద్య ప్రదేశ్ లోని ఇండోర్ లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. అమిత్ యాదవ్ అనే అతను ఫేక్ ఎకౌంటు ఓపెన్ చేసి 17 సంవత్సరాల అమ్మాయి ప్రియా రావత్ తో స్నేహం పెంచుకున్నాడు. ఇద్దరూ తరచూ చాటింగ్ చేసుకునేవారు. కొన్నాళ్ళ తరవాత ఆ అకౌంట్ అమ్మాయిది కాదు అనీ అమిత్ యాదవ్ అనే అబ్బాయిది అనీ తెలుసుకున్ని ప్రియ అతన్ని దూరంగా పెట్టింది. చాటింగ్ పూర్తిగా ఆపేసి తనని చీట్ చేసాడు అంటూ కోప్పడింది. చాటింగ్ ఒక్కసారిగా ఆపేయడం తో అమిత్ తట్టుకోలేకపోయాడు. ఏకంగా ఆమె ఇంటికి వచ్చి చాటింగ్ ఎందుకు చెయ్యడం లేదు అంటూ గొడవ చేసాడు. అమ్మాయివి అనుకుని చాటింగ్ చేశా, అబ్బాయివి అని మానేసా అని ఆమె తెగేసి చెప్పింది. అసలు నువ్వు ఎవరో తనకు తెలియదని చెప్పింది. దీంతో అప్పటికే కోపంతో రగిలిపోతున్న అమిత్ వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియపై దాడిచేశాడు. అడ్డొచ్చిన ఆమె తల్లిపైనా దాడికి తెగబడ్డాడు. అనంతరం ప్రియా ఇంటి రెండో అంతస్తు నుంచి దూకి పారిపోయేందుకు అమిత్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని కాళ్ళు విరిగిపోయాయి కూడా.

  •  
  •  
  •  
  •  

Comments