షాకింగ్ : ఫేస్ బుక్ హెడ్ జుకర్ బర్గ్ ని చంపేశారు

Saturday, November 12th, 2016, 11:50:13 PM IST

mark-zuckerberg
కొన్ని సంఘటనలు చూస్తే నవ్వాలో, ఆశ్చర్య పోవాలో కూడా అర్ధం కాదు.ఫేస్ బుక్ ని కనిపెట్టి ఆ సంస్థ ని ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ చేసిన ఆ సంస్థ సీయీవో మార్క్ జుకర్ బర్గ్ ని ఆ సంస్థే చంపేసింది. చనిపోయిన వారికోసం పెట్టే ప్రొఫైల్స్ లో అతని ఎకౌంటు ని పోస్ట్ చేసేసింది ఈ సంస్థ. దాదాపు 20 లక్షల మెమోరియల్ ప్రొఫైల్స్ ను పోస్ట్ చేసింది. వీటిలో సంస్థ అధినేత జూకర్ బర్గ్ పేరు కూడా ఉంది. అంతేకాదు, ఎంతో మంది బతికున్న వారిని చనిపోయినట్టు చూపించింది. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకున్న ఫేస్ బుక్ సిబ్బంది నాలుక్కరుచుకున్నారు. తమ యూజర్లకు క్షమాపణ చెప్పారు. పెద్ద తప్పు జరిగిందని… దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నామని ఫేస్ బుక్ తెలిపింది. జరిగిన దానికి సంబంధించి ఫేస్ బుక్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.