ఆక్యుపంక్ష‌ర్ అంటూ జేబుకు పంక్ష‌ర్ వేస్తుండు!!

Friday, January 20th, 2017, 10:13:34 AM IST

actupumcture
ఆక్యుపంక్ష‌ర్ (సూదులు గుచ్చి నాడిని ప్రేరేపించు) వైద్యం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో ఫేమ‌స్‌. చైనా నుంచి పుట్టుకొచ్చిన ఈ వైద్యం మ‌న దేశంలోనూ హ‌వా సాగిస్తోంది. ఎంతో మంది ప్ర‌జ‌లు అల్లోప‌తి ర‌సాయ‌నాల‌కు భ‌య‌ప‌డి ఇలాంటి నేచుర‌ల్ వైద్యాన్ని న‌మ్ముకునేందుకు ముందుకు వ‌స్తున్నారు. అయితే ఇదే అద‌నుగా మోస‌గాళ్లు బ‌రిలో దిగి ధ‌నార్జనే ధ్యేయంగా చెలరేగిపోతున్నారు. తెలిసీతెలియ‌ని వైద్యం చేసి ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నారు. ఇలాంటి కేటుగాళ్ల లాంటి డాక్ట‌ర్లు తెలుగు రాష్ట్రాల్లో పెక్కుమంది ఉన్నార‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. లేటెస్టుగా క‌న్న‌న్ అనే ఆక్యుపంక్ష‌ర్ డాక్ట‌ర్ జేబుకు పంక్షర్లు వేస్తున్న తీరుపై ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున క‌ల్లోలం మొద‌లైంది. ప్ర‌స్తుతం అత‌గాడిని ఓ టీవీ చానెల్ స్టింగ్ ఆప‌రేష‌న్‌లో ప‌ట్టించేసింది. ప్ర‌స్తుతం లైవ్‌లో విజువ‌ల్స్ వేస్తూ స‌ద‌రు ఆక్యుపంక్ష‌ర్ డాక్ట‌ర్‌కి పంక్షర్ వేస్తోంది స‌ద‌రు చానెల్‌.

బాదితులు ఒక్కొక్క‌రు లైవ్‌లోకొచ్చారు. స‌ద‌రు డాక్ట‌ర్‌ చేతి నాడి చూసి, సూదులు గుచ్చి ఇదే ఆక్యుపంక్ష‌ర్ అంటూ మోసం చేస్తూ ఒక్కొక్క‌రి వ‌ద్ద నుంచి రూ.300 మినిమం వ‌సూలు చేస్తున్నాడని, అస‌లు ఈ వైద్యానికి ఎలాంటి రిజ‌ల్ట్ క‌నిపించ‌లేద‌ని లైవ్ సాక్షిగా వాపోతున్నారు. డియ‌ర్ పీపుల్‌.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌! పంక్ష‌ర్లు వేయించుకోకండి ..అస‌లైన‌ వైద్యుడెవ‌రో గుర్తించి ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డండి.