ఎన్టీఆర్ కు కూతురు పుట్టిందనే వార్తపై క్లారిటీ ఇచ్చిన పిఆర్ఓ

Tuesday, June 5th, 2018, 09:44:42 AM IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజమేదో అబద్దం ఎదో తెలియని పరిస్థితి ఏర్పడింది. రీసెంట్ గా టాలీవుడ్ లో అందుకు ఓ ఘటన ఉదాహరణంగా నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రణతి దంపతులకు కుమార్తె జన్మించిందని వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. 10.20 గంటలకు పాపకు ప్రణతి జన్మనిచ్చినట్టు ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అయ్యింది. కొంత మంది అభిమానులు ఇదే నిజమనుకొని స్పెషల్ పోస్టులు పోస్టర్లు రెడీ చేశారు.

అయితే ఆ విషయంలో ఎన్టీఆర్ పిఆర్ఓ క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి నిజం లేదని ఫెక్ న్యూస్ అని కొట్టి పారేశారు. దీంతో అందరికి ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రీవిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ అయ్యింది. తారక్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments