రావు రమేష్ ఇంట్లో తీరని విషాదం…

Saturday, April 7th, 2018, 11:23:23 AM IST

తండ్రిని మించిన నటనతో తెలుగు ప్రేక్షకులలో మంచి పేరు తెచ్చుకొని చేసే ప్రతీ పాత్రకి న్యాయం చేస్తూ ఒక గొప్ప నటుడుగా పేరు తెచ్చుకున్నాడు రావు రమేష్. కథ ఏదైనా క్యారెక్టర్ ఏదైనా రేయింబవళ్ళు కష్టపడుతూ చేసిన ప్రతీ సినిమాలో తనకంటూ ఏదో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. అంచెలంచెలుగా ఎదుగుతూ తండ్రి రావు రావు రమేష్ పేరు నిలబెట్టి కొడుకుగా గొప్ప నటుడుగా నిలిచాడు. ఇదిలా ఉంటే ఇటివల ప్ర‌ముఖ సినీ న‌టుడు రావు ర‌మేష్ త‌ల్లి క‌మ‌లా కుమారి కొండాపూర్ లోని త‌న నివాసంలో క‌న్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి ప‌లువురు ప్రముఖులు సంతాపం తెలియ‌జేశారు. రావు ర‌మేష్ అప్ప‌టి న‌టుడు రావు గోపాల‌రావు త‌న‌యుడు అన్న సంగ‌తి తెలిసిందే.