సెన్సేషనల్ ట్వీట్ : సంజు టీజర్ తో రాజమౌళికి దిమ్మ తిరిగిందా..?

Wednesday, April 25th, 2018, 06:28:07 PM IST

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ జీవితాధారంగా ఓ బయోపిక్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘సంజు’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మంగళవారం ఫస్ట్‌లుక్‌ను, టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రీల్‌ లైఫ్‌ సంజయ్‌ పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్నారు. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్‌లో 22 ఏళ్ల వయసు నుంచి జైలు నుంచి విడుదలయ్యే వరకూ వివిధ దశల్లో ఉన్న సంజయ్‌ గెటప్‌లలో రణ్‌బీర్‌ కనిపించారు. రాకీ, మున్నాభాయ్‌ లాంటి పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లోని సంజయ్‌ గెటప్పుల్లో రణ్‌బీర్‌ కనిపించడం ఆకట్టుకుంటోంది. మీరు నమ్మలేని ఓ యథార్థ గాథ అంటూ మొదలైన ఈ టీజర్‌లో సంజయ్‌ పాత్ర తన జీవితం గురించి చెప్పిన విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. టీజర్‌ విడుదల చేయడంలో ఆలస్యమైనా సినిమాపై ఆసక్తి తగ్గలేదని సినీ ప్రముఖులు ప్రశంసలు గుప్పించారు. అయితే ‘సంజు’ టీజర్‌పై దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి కూడా స్పందించారు. ‘టీజర్ చూశాక దిమ్మ తిరిగిపోయింది. రణ్‌బీర్‌..చాలా బాగా నటించావు. రాజ్‌కుమార్‌ హిరాణీ ఓ మాస్టర్’ అని ట్వీట్‌ చేశారు.

ఈ సినిమాను విదు వినోద్ చోప్రా, రాజ్‌కుమార్‌ హిరాణీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మనీశా కోయిరాలా, అనుష్క శర్మ, దియా మీర్జా, పరేశ్‌ రావల్‌, సోనమ్‌ కపూర్‌ కీలక పాత్రలు పోషించారు. జూన్‌ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  •  
  •  
  •  
  •  

Comments