‘బావలు సయ్యా.. హే మరదలు సయ్యా’ పాడిన సింగర్ ఇకలేరు

Saturday, November 11th, 2017, 05:00:17 PM IST

సిల్క్ స్మితా అంటే తెలుగులో అందరికి ఒక పాట తప్పకుండా గుర్తొస్తుంటోంది. అదే ‘బావలు సయ్యా.. హే మరదలు సయ్యా ‘. బావ- బావమరిది సినిమాలలోని ఈ పాట అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇప్పటికి యువత సరదాకి ఈ సాంగ్స్ ని పెట్టుకొని చిందులు వేస్తుంటారు. అయితే ఇంత పాపులర్ సాంగ్ పాడిన గాయని రాధిక ఇక లేరు. ఎవరు ఊహించని విధంగా ఆమె గుండె పోటుతో నిన్నఉదయం చెన్నై లోని హాస్పటల్ లో కన్ను మూశారు. తిరుపతి కి చెందిన రాధికా 2004 నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు. అప్పట్లో ఆమె చాలా బిజీగా ఉండేది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిల్ కన్నడ భాషల్లో దాదాపు 200కు పైగా పాటలు పాడారు. మణిశర్మ – కోటి వంటి వారి బాణీలకు కూడా రాధికా గాత్రాన్ని అందించారు. ఆమె మరణ వార్త విన్న సౌత్ ఇండస్ట్రీ సంగీత దర్శకులు సంతాపాన్ని తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments