శ్రీరెడ్డి లీక్స్ : శ్రీ రెడ్డిని శారీరకంగా బలవంత పెట్టిన ప్రముఖ రైటర్…

Thursday, April 12th, 2018, 01:26:38 PM IST

శ్రీరెడ్డి లీక్స్ ప్ర‌కంప‌న‌లు ఉవ్వెత్తున కొన‌సాగుతూనే ఉన్నాయి. గత నెల రోజులుగా తెలుగు చిత్ర సీమలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ ఫై రోజుకో వీడియో పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్న శ్రీ రెడ్డి, తాజాగా శ‌నివారం ఫిల్మ్ చాంబర్ దగ్గర మా సభ్యత్వం ఇవ్వాలంటూ అర్ద నగ్న ప్రదర్శన చేసి నానా భీభత్సం సృష్టించిన సంగతి తెల్సిందే. దీంతో జాతీయ చానెల్స్ సైతం శ్రీ రెడ్డి ఫై ఫోకస్ చేయడం మొదలు పెట్టింది. దెబ్బకి శ్రీ రెడ్డి ఒక్కసారిగా ఇంటర్ నేషనల్ స్టార్ అయి కూర్చుంది. ఇప్ప‌టికే ఇన్‌డైరెక్ట్‌గా వ‌రుస లీకుల‌తో టాలీవుడ్ ప్ర‌ముఖుల‌ని ముప్పు త్రిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్న శ్రీరెడ్డి.. రెండురోజులుగా డైరెక్ట్‌గానే మీడియా డిబేట్‌లో నేరుగా ఫొటోలు లీక్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు రెండ‌వ కుమారుడు అభిరాంతో రొమాంటిక్‌గా ఉన్న ఫొటోలను మీడియా ద్వార బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి విదితమే. దీంతో టాలీవుడ్‌లో పెద్ద దుమార‌మే రేపుతోంది.

అయితే తాజాగా శ్రీరెడ్డి మరో రచ్చ చేసింది. టాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ ఫేమస్ రైట‌ర్ త‌న‌ను బంజారాహిల్స్ శ్మ‌శానం వెనుక ఉన‌న గెస్ట్‌హౌస్‌కు పిలిచి తనతో పడుకోమని బలవంతం చేశాడ‌ని శ్రీరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. గెస్ట్ హౌస్‌కు వెళ్ళ‌గానే మొద‌ట‌ తాగుతావా అని అడిగారని, దానికి తనకు అలవాటు లేదని చెప్పానని.. ఆ తరువాత తనను శారీరకంగా తనకి సహాయం చేయమని అన్నాడని ఆమె ఆరోపించారు. ఇది నిరూపించడానికి తన దగ్గర కొన్ని ఛాట్ షాట్స్ కూడా ఉన్నాయని, పోలీసులు విచారణ చేస్తే, తనకు ఎప్పుడు ఎప్పుడు ఫోన్‌లు చేసారు, ఇతర వివరాలు అన్నీ బయటకు తీస్తానని శ్రీరెడ్డి అన్నారు. ఈ విషయంలో లీగల్‌గా ప్రొసీడ్ అవుతానని ఆమె అన్నారు. ఇంకా త‌న‌ద‌గ్గ‌ర చాలామంది గుట్టు ఉంద‌ని.. కొంత‌మంది సాక్ష్యాలు మీడియాకు అందించాన‌ని.. త్వ‌ర‌లోనే అంద‌రి బండారం బ‌య‌ట పెడ‌తాన‌ని శ్రీరెడ్డి చెప్పింది. ఇక శ్రీరెడ్డి వ్యాఖ్య‌ల పై రైటర్ కూడా ఆగ్రహంగా స్పందిచారు.. శ్రీరెడ్డి ఎవ‌రో త‌న‌కు అసలు తెలియ‌ద‌ని.. ఈ చర్చలు జరగడం మొదలైనప్పటి నుండే ఆమె గురించి తెలిసిందని అంతకు మించి అతనికేం తెలియదని అన్నారు. ఆమె నా పేరు ఎందుకు చెప్పిందో కూడా తెలియ‌ద‌ని.. ఈ వ్య‌వ‌హారం ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకొని విచార‌ణ జ‌రిపించాల‌ని ఆ రైటర్ వ్యాఖ్యానించారు.

  •  
  •  
  •  
  •  

Comments