హీరోయిన్ కాజల్ కు షాకిచ్చిన అభిమాని!

Friday, February 2nd, 2018, 04:47:41 PM IST

దర్శకులు తేజ తీసిన చిత్రం లక్ష్మికళ్యాణం తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు నటి కాజల్ అగర్వాల్. మొదటి చిత్రం పెద్దగా విజయం సాధించకపోయినా, తర్వాత వచ్చిన చందమామ తో మంచి పేరు సంపాదించిన ఆమె, కొన్ని చిత్రాల తర్వాత దర్శకధీరులు రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం మగధీరతో అద్భుత విజయంతో టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. అక్కడి నుండి ఈ దశాబ్ద కాలంలో దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆమె నటించారు. అయితే ఆమె నటిస్తున్న తాజా చిత్రం “అ”. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొంత మంది అభిమానులకు హీరోయిన్ కాజల్ తో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. అయితే అందులో ఒక అభిమాని కాజల్ ను అక్క అని సంబోధించగా, ఆమెతో సహా అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. వెనువెంటనే అతడు ‘ఐ లవ్ యు’ అని వారిని మరింత షాక్ కి గురిచేశాడు. ఈ విషయమై కాజల్ స్పందిస్తూ మొదట అక్కా అన్నావు, మళ్ళి వెంటనే ఐ లవ్ యు అన్నావెంటని కాజల్ ప్రశ్నించగానే అక్కడున్న వారందరిలో నవ్వులు విరిశాయి. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు…